నేడు మరో రెండు నూతన కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
నేడు మరో రెండు నూతన కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
నేడు మరో రెండు నూతన కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్ మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9గంటల 45 నిమిషాలకు మహబూబాబాద్‌కు చేరుకుంటారు సీఎం కేసీఆర్. ఉదయం 10 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌ను, ఉదయం 11 గంటలకు నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో కేసీఆర్ భేటీ అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.
మహబూబాబాద్ జిల్లా పర్యటన అనంతరం అక్కడి నుంచి సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు బయల్దేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు పాల్వంచలో నూతన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డుమార్గాన కొత్తగూడెం చేరుకుంటారు సీఎం కేసీఆర్. కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు సీఎం కేసీఆర్. సీఎం టూర్ నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.