CM KCR: దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు..

CM KCR: దేశంలో తెలంగాణ రాష్ట్రానిది ఒక ప్రత్యేక స్థానమన్నారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర్య భారత స్ఫూర్తి ఈ తరం పిల్లలకు, యువకులకు తెలియాలన్నారు.

Update: 2022-08-22 15:00 GMT

CM KCR: దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు..

CM KCR: దేశంలో తెలంగాణ రాష్ట్రానిది ఒక ప్రత్యేక స్థానమన్నారు సీఎం కేసీఆర్. స్వాతంత్ర్య భారత స్ఫూర్తి ఈ తరం పిల్లలకు, యువకులకు తెలియాలన్నారు. అందుకే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అహింసావాదం గొప్పదనాన్ని మహాత్మా గాంధీ ప్రపంచ మాన‌వాళికి తెలియజేశారని కేసీఆర్ చెప్పారు. అటువంటి మ‌హాత్ముడు పుట్టిన గ‌డ్డ మ‌న భార‌తావ‌ని అని గుర్తు చేశారు. గాంధీ మార్గంలో దేశం పురోగ‌మించాలన్నారు. అహింసా సిద్ధాంతాన్ని ఉప‌యోగించుకొని తెలంగాణ సాధించామన్నారు కేసీఆర్.

ఇప్పటికీ దేశంలో పేదల ఆశలు నెరవేరని పరిస్థితులు ఉన్నాయి. అడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తోంది. అనేక వర్గాల ప్రజలు మాకు స్వాతంత్ర్య ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని విస్మరించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. చూస్తూ మౌనం వహించడం సరైంది కాదు. అర్థమై కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తామో.. ఆ సమాజం గొప్పగా పురోగమించేందుకు వీలుంటుంది. అద్భుతమైన వనరులు ఉన్న ఈ దేశం అనుకున్న విధంగా పురోగమించడం లేదు. ఈ స్వాతంత్ర్యం మనకు ఊరికే లభించలేదు. ఆ స్ఫూర్తితో కులం, మతం, జాతి అనే భేదం లేకుండా.. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

Tags:    

Similar News