CM KCR: త్వరలో ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

CM KCR: సంస్థ తిరిగి పుంజుకోవడానికి అవలంభించాల్సిన అంశాలపై చర్చ

Update: 2021-09-22 01:01 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుదల అంశాలపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సమగ్ర ప్రతిపాదనలను రూపొందించాలని రవాణా, విద్యుత్‌ శాఖ మంత్రులు, అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్ ఆర్టీసీ, విద్యుత్ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్..ఛార్జీల పెంపుదలపై చర్చించారు. ఆర్టీసీని పటిష్ఠపరిచేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టామని, గాడిలో పడుతోందనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్‌ ధరల నేపథ్యంలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.

ఆర్టీసీ గట్టెక్కించేందుకు ఛార్జీలు పెంచడం సహా ఇతర ఆదాయ మార్గాలను చేపట్టాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు కేబినెట్ సమావేశం ముందుకు తీసుకురావాలని కేసీఆర్ సూచించారు. విద్యుత్ అంశంపైనా మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావు సీఎం కేసీఆర్ తో చర్చించారు. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరిగా విద్యుత్ సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాని వివరించారు. విద్యుత్ శాఖను అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఛార్జీలు పెంచాలని కేసీఆర్ కు విన్నవించారు.   

Tags:    

Similar News