Kishan Reddy: వైజాగ్ స్టీల్ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదు..
Kishan Reddy: సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Kishan Reddy: వైజాగ్ స్టీల్ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదు..
Kishan Reddy: సీఎం కేసీఆర్ పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక మూతపడ్డ ఒక్క ఫ్యాక్టరీని కూడా తెరిపించలేకపోయారని విమర్శించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయని కేసీఆర్‌కు స్టీల్ ప్లాంటు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కిషన్ రెడ్డి. బయ్యారం స్టీల్ఫ్లాంట్ ఏర్పాటు హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తామన్న కేసీఆర్ నోరు విప్పాలన్నారు.