Junior Doctors: జూడాలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

Junior Doctors: జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2021-05-26 11:34 GMT

సీఎం కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Junior Doctors: జూనియర్‌ డాక్టర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో సమ్మె చేయడాన్ని తప్పుబట్టారు. కరోనాతో ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు సమ్మెకు పిలుపునివ్వడం సరికాదన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే విధులకు హాజరుకావాలని సీఎం కేసీఆర్ సూచించారు.

జూనియర్‌ డాక్టర్ల విషయంలో తమ ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదన్న కేసీఆర్‌ జూడాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలను 15శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోవిడ్‌ సేవల్లో ఉన్న వైద్య విద్యార్ధులకు కూడా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనమే అందించాలని ఆదేశించామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే జూనియర్ డాక్టర్లకు మెరుగైన స్టైఫండ్‌ ఇస్తున్నామని అయినా, ఇలా సమ్మె పేరుతో విధులు బహిష్కరించడం సరైన పద్ధతి కాదని అన్నారు.

Tags:    

Similar News