New Scheme: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుక..!

CM KCR: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది.

Update: 2023-09-15 14:22 GMT

New Scheme: పాఠశాల విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుక..!

CM KCR: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో దసరా (అక్టోబర్‌ 24) నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించనున్నట్లు సర్కారు వెల్లడించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది.

ఉదయాన్నే వ్యవసాయ పనులు, కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్‌ మానవీయ ఆలోచనకు అద్దం పట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఈ అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నది. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పథకం ద్వారా ఖజానాపై ఏటా రూ.400 కోట్ల భారం పడనుంది.

Tags:    

Similar News