హైదరాబాద్‌లో సృష్టి తరహా మరో కేసు వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 12 మంది వ్యక్తులను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి ఇద్దరు పసికందులను ఎస్‌వోటీ పోలీసులు రక్షించారు.
ఈ ముఠా దాదాపు 8 ఆస్పత్రులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని గుర్తించారు. అలాగే ఈ గ్యాంగ్ ఇప్పటివరకు 15 మంది పిల్లలను అమ్మినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పిల్లలతో పాటు అహ్మదాబాద్ నుంచి పిల్లలను తెచ్చి అమ్మకాలు జరిపినట్లు పేర్కొ్న్నారు. ఒక్కొక్క శిశు అమ్మకం వెనకాల 15 లక్షల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.