CM KCR: మరోసారి రాష్ట్రాల పర్యటనకు కేసీఆర్ శ్రీకారం

CM KCR: ఏప్రిల్ చివరి వారంలో ఉత్తరప్రదేశ్, కేరళలో పర్యటన

Update: 2022-04-15 02:09 GMT

CM KCR: మరోసారి రాష్ట్రాల పర్యటనకు కేసీఆర్ శ్రీకారం

CM KCR: దేశ రాజకీయాల్లో కీలకంగా మారడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి రాష్ట్రాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల చివరి వారంలో రెండు రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. దేశంలో రాజకీయ మార్పులు తీసుకు రావాలని భావిస్తున్న కేసీఆర్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయడానికి కలిసి నడుద్దామని నిర్ణయించుకున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి మరోసారి పలు రాష్ట్రాల్లో సీఎం పర్యటించబోతున్నారు.

రైతు ఉద్యమం తీసుకు రావడానికి కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్ వేదికగా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర బీజేపీపై పలు రాష్ట్రాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందని పలు ప్రాంతీయ పార్టీల నేతలు ధ్వజమెత్తుతున్నారు. ప్రాంతీయ పార్టీలతోనే దేశ రాజకీయాల్లో మార్పులు సాధ్యమని భావిస్తున్నారు.

త్వరలోనే సీఎం కేసీఆర్ ఉత్తర ప్రదేశ్ , కేరళలో పర్యటించనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్‌తో భేటీ కానున్నారు. ఇరువురు నేతలు సమావేశం అనంతరం మరికొన్ని రాష్ట్రాల్లో పర్యటనకు కార్యాచరణ ప్రకటించనున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతపై ఢిల్లీ వేదికగా ప్రాంతీయ పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. ముందు ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ పర్యటించిన తరవాత ప్రాంతీయ పార్టీల నేతల సమావేశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Tags:    

Similar News