Weather: ఎండకాలంలో వర్షాలు... వర్షాకాలంలో ఎండలు

Weather: దేశంలో ఓ కొత్త కాలం... అదే మాయదారి కాలం

Update: 2023-09-02 02:07 GMT

Weather: ఎండకాలంలో వర్షాలు... వర్షాకాలంలో ఎండలు

Weather: ఏ కాలంలో జరగాల్సింది ఆ కాలంలో జరిగితే అదో అందం... ఆనందం. సీజన్ ను బట్టి ఎండాకాలంలో ఎండలు... వానా కాలంలో వానలు కురిస్తేనే అంతా బాగుంది.... అందరూ బాగున్నట్లు... అనే దానికి సంకేతం. కాని ప్రస్తుత కాలంలో ఇవేవీ జరగడం లేదు. ఎండకాలంలో వర్షాలు... వర్షాకాలంలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఏ కాలంలో ఏ వాతావరణం ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఏడాదికి మూడు కాలాలు. మొదటిది వేసవి కాలం. రెండోది వర్షాకాలం. మూడోది శీతాకాలం. కాని ఈ మధ్య కాలం తీరు మారిపోయింది. దేశంలో ఓ కొత్త కాలం వచ్చింది. అదే మాయదారి కాలం. ఈ కాలంలో ప్రజలు మాడిపోతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. జనం అష్టకష్టాలతో అల్లాడుతున్నారు. 

Tags:    

Similar News