Choppadandi: గొలుసుకట్టు చెరువులను ఎల్లంపల్లి పైపుల ద్వారా వచ్చే నీటితో నింపాలి

నియోజకవర్గంలోని అన్ని మండలాలలో గొలుసుకట్టు చెరువులను వెంటనే, ఎల్లంపల్లి పైప్లైన్ ద్వారా వచ్చే నీటితో నింపాలని చొప్పదండి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2020-03-06 06:51 GMT

చొప్పదండి: నియోజకవర్గంలోని అన్ని మండలాలలో గొలుసుకట్టు చెరువులను వెంటనే, ఎల్లంపల్లి పైప్లైన్ ద్వారా వచ్చే నీటితో నింపాలని చొప్పదండి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట గ్రామంలో, పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ... రామడుగు, గంగాధర మండలాల నుండి వెళ్ళే ఎల్లంపల్లి పైప్లైన్ ద్వారా నారాయణపూర్, కొడిమ్యాల పోతారం రిజర్వాయర్లలోకి నీటిని నింపినట్లు పైప్లైన్ ద్వారా వెంట, అనుసంధానంగా ఉన్న ప్రతి చెరువులోకి నీటిని విడుదల చేసినట్లయితే రైతాంగానికి యాసంగి సాగుకు త్రాగునీటికి ఉపయోగకరం ఉంటుందని అన్నారు.

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతాంగం కోసం ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్, మండల నాయకులు దిలీప్, శివ, నరేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.


Tags:    

Similar News