Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు
Kalvakuntla Kavitha: బంజారాహిల్స్‌లోని కవిత ఇంట్లో సీబీఐ విచారణ
Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు.. కవితను విచారిస్తున్నారు. రెండు వాహనాల్లో కవిత ఇంటికి వచ్చిన సీబీఐ బృందం.. లిక్కర్ స్కామ్‌లో కవితను ప్రశ్నిస్తున్నారు. మొత్తం ఐదుగురు సీబీఐ అధికారుల్లో.. ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. ఒక ప్రత్యేక గదిలో అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా.. కవితను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కవిత అడ్వొకేట్ సమక్షంలో స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు.. కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలను నిర్వహించకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కవిత ఇంటికి వెళ్లే దారిని రెండువైపులా పోలీసులు క్లోజ్ చేశారు.