Hyderabad: డీమార్ట్‌లో ఫ్రీగా చాకెట్లు తింటూ ఇన్‌స్టా రీల్‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad: అతనికి సహకరించిన మరో యువకుడు

Update: 2024-01-25 14:45 GMT

Hyderabad: డీమార్ట్‌లో ఫ్రీగా చాకెట్లు తింటూ ఇన్‌స్టా రీల్‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

Hyderabad: ఇన్‌‌స్టాగ్రాం రీల్ తీసి... ఫేమస్ అవుదామకున్న యువకుడు... చివరికి... కటకటాలపాలయ్యాడు. హనుమాన్ నాయక్ అనే యువకుడు డీమార్ట్ స్టోర్‌‌లోకి వెళ్లి... ఫ్రీగా చాక్లెట్ ఎలా తినాలో తెలుసా..అని ఓ రీల్ చేసి.. ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ చేశాడు.. దీనికి అతని స్నేహితుడు సహకరించారు. చాక్లెట్ తీసుకొని... డీమార్ట్‌లోనే ట్రయల్ రూంలోకి వెళ్లి... చాక్లెట్ తిన్నాడు.. అలా తినే దాన్ని వీడియో తీసి.. ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలను గుర్తించిన డీమార్ట్‌ షేక్‌పేట బ్రాంచ్‌ మేనేజర్‌ అర్జున్‌సింగ్‌ బుధవారం ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాక్లెట్లను దొంగిలించిన హనుమంత్‌ నాయక్‌తోపాటు అతడి స్నేహితులపై ఐపీసీ 420, 379 సెక్షన్లతోపాటు ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News