Kamareddy: ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఆవిరైంది.. గుండెపోటుతో బీ.టెక్ విద్యార్థి మృతి!
Heart Attack: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
Kamareddy: ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఆవిరైంది.. గుండెపోటుతో బీ.టెక్ విద్యార్థి మృతి!
Heart Attack: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు, ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా జగసాంబతండాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటులో బీ.టెక్ విద్యార్థి మృతి చెందాడు. నిద్రలోనే గుండెపోటుతో ప్రశాంత్ మృతి చెందినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఇటివలే ప్రశాంత్ ఉద్యోగం సాధించాడు. కొడుకుకు మంచి ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు స్వీట్లు పంచిపెట్టారు. ఇంతలోనే ప్రశాంత్ గుండెపోటుతో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రశాంత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.