BRS to HYDRAA: వారిపై హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకోవాలి - బీఆర్ఎస్
HYDRAA commissioner AV Ranganath: బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం ఇవాళ హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను కలిశారు.
BRS leaders' complaint to HYDRAA commissioner AV Ranganath: హైడ్రా పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ జనాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా, రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై వారు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మంగళవారం హైడ్రా కమిషనర్‌ను కలిసిన మన్నె గోవర్థన్ రెడ్డి, కే కిషోర్ గౌడ్, ఆశిష్ కుమార్ యాదవ్, రంగినేని అభిలాష్ రావు.. హైడ్రా పేరుతో ఫేక్ ఎకౌంట్స్ ద్వారా తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ఫేస్ పోస్టులు పెట్టే వారు జనాన్ని నమ్మించడం కోసం తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని (Telangana govt emblem) కూడా ఉపయోగిస్తున్నారని వారు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఫేక్ ఎకౌంట్స్ నిర్వహిస్తున్న వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నందున వారిపై సైబర్ క్రైమ్ దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా కోరారు.
Lodged a formal complaint with Hyderabad Commissioner Shri Ranganath IPS against blatant misuse of #HYDRAA’s name & unauthorised use of Govt emblem on social media.
— Ashish Kumar Yadav (@AshishKumarBRS) April 29, 2025
Such acts undermine public trust & demand swift, exemplary action.@Comm_HYDRAA @JtCPTrfHyd @BRSparty @KTRBRS pic.twitter.com/6F2e5mCVsu
అలాంటి ఫేక్ పోస్టులు చూసి జనం అయోమయానికి గురికాకుండా ఉండేందుకు ఆయా ఫేక్ ఖాతాలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ హైడ్రా తరపున ఒక అధికారిక ప్రకటన విడుదల చేయాల్సిందిగా వారు కమిషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు. హైడ్రా ఎప్పుడూ న్యూట్రల్ గానే వ్యవహరిస్తుంది కానీ ఏ రాజకీయ పార్టీకి అనుగుణంగా వ్యవహరించదు అనే విషయాన్ని తేటతెల్లం చేసేందుకు ఆ ప్రకటన ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.