PM Modi: బీఆర్ఎస్ అవినీతిని పెంచి పోషిస్తోంది.. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగింది

PM Modi: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు తెలంగాణకు ద్రోహం చేశాయి, ఈ రెండు పార్టీల నుంచి తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

Update: 2023-07-08 10:01 GMT

PM Modi: బీఆర్ఎస్ అవినీతిని పెంచి పోషిస్తోంది.. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగింది

PM Modi: కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎక్కడైనా అభివృద్ధి కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని.. కానీ అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. దీని కోసమేనా యువత ఆత్మబలిదానాలు చేసిందని మోడీ ప్రశ్నించారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్‌ చూపించింది... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పార్టీలు అవినీతికి కొమ్ముకాస్తున్నాయని.. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిని పెంచి పోషిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దేనని.. 9 ఏళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

Tags:    

Similar News