నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

నాంపల్లి సిటీ సివిల్ కోర్ట్స్ ప్రాంగణంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ చూసి అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Update: 2025-12-18 12:16 GMT

హైదరాబాద్: నాంపల్లి సిటీ సివిల్ కోర్ట్స్ ప్రాంగణంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ చూసి అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్కాడ్ తో రంగంలోకి దిగారు. భద్రతా కారణాల రీత్యా కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని బయటకు పంపించారు. పోలీసులు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబు నిర్వీర్య దళాలతో తనిఖీలు చేపట్టారు.

ముమ్మర దర్యాప్తు

కోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దాంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఈ బెదిరింపు మెసేజ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News