Congress: కాంగ్రెస్‌లో చేరిన బోడుప్పల్ కార్పోరేటర్లు
Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
Congress: కాంగ్రెస్‌లో చేరిన బోడుప్పల్ కార్పోరేటర్లు
Congress: మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. నాయకుల మధ్య అంతర్యుద్ధం రాజీనామాల వరకు చేరింది. బోడుప్పల్లో బీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు కార్పొరేటర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే జాబితాలోకి మరి కొంతమంది కార్పొరేటర్లు కొన్ని రోజులుగా పార్టీకి సంబంధించిన బాధ్యతలకు తమ కార్పొరేషన్ లలో తమకు కాకుండా వేరే వాళ్లకు అప్పగించడంపై మనస్తాపానికి గురయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశామని తెలిపారు. మాజీ ఎమ్మాల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాయకులు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.