Black Fungus: తెలంగాణలో భయపెడుతోన్న బ్లాక్ ఫంగస్
Black Fungus: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పలు కేసులు
Black Fungus (The Hans India)
Black Fungus: తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా, తాజాగా ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ బయటపడింది. మధిర మండలం నేరడ గ్రామంలో తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్లు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వైద్యులు గుర్తించారు. దాంతో, మెరుగైన చికిత్స కోసం అతడిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, తాళ్లూరి భద్రయ్య ఇటీవలే కరోనా నుంచి కోలుకోగా.... అతడిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేపింది.