నిర్మల్, ఖానాపూర్‌లో బీజేపీ క్యాంప్ రాజకీయాలు

నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభం. కౌన్సిలర్లను అయోధ్యకు తరలించినట్టు సమాచారం.

Update: 2026-02-12 10:23 GMT

నిర్మల్, ఖానాపూర్‌లో బీజేపీ క్యాంప్ రాజకీయాలు

మున్సిపల్ సమరం ముగిసింది. అయితే.. యుద్ధం ఇంకా మిగిలే ఉంది. మున్సిపల్ పీఠం కోసం తెరవెనుక ఆ కసరత్తు జరుగుతూనే ఉంది. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. బీజేపీ ఓ అడుగు ముందుకు వేసి... ఏకంగా క్యాంప్ రాజకీయాలకు తెర తీసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. బీజేఎల్పీ నేత, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్‌కు చెందిన 42 మంది కైన్సిలర్లు, ఖానాపూర్‌కు చెందిన మరో 12 మంది వార్డులకు చెందిన కౌన్సిలర్లును క్యాంప్‌నకు తరలించారు. మొత్తం 3 బస్సుల్లో 49 మందిని అ‍యోధ్యకు తరలించినట్టు తెలుస్తుంది. క్యాంప్‌ వెళ్లిన కౌన్సిలర్లు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక రోజునే తిరిగి రానున్నారు. ఎట్టిపరిస్థితుల్లో నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో బీజేపీ పట్టు సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Tags:    

Similar News