Nizamabad: ఆట వికటించింది! ఇద్దరు ఆడపిల్లల తండ్రిని బలితీసుకున్న కుస్తీ పోటీ

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నంలో కుస్తీ పోటీలు ఒక వస్తాద్ ప్రాణాన్ని బలితీసుకున్నాయి.

Update: 2026-04-04 06:47 GMT

Nizamabad: ఆట వికటించింది! ఇద్దరు ఆడపిల్లల తండ్రిని బలితీసుకున్న కుస్తీ పోటీ

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నంలో కుస్తీ పోటీలో పాల్గొన్న వస్తాద్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నవి పేట ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రెంజల్ మండలం బాగేపల్లికి చెందిన కోరుట్ల లక్ష్మణ్ 48 చిన్నప్పుడు నుండి కుస్లీ పోటీలలో పాల్గొనేవాడు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన కుస్తీ పోటీల్లో పలువురు కుస్తీ వస్తాదులతో తలపడ్డాడు. అభంగపట్నం గ్రామ అభివృద్ధి కమిటీ నిర్వహించిన పోటీలలో పలు ప్రాంతాల నుండి వస్తాదులు తరలివచ్చారు. లక్ష్మణ్ సైతం పోటీలో పాల్గొని తన ప్రతిభను కనబరిచాడు. పోటీలో పాల్గొన్న సమయంలో గాయాలవడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతునికి భార్య విజయ ఇద్దరు ఆడ కూతుర్లు ఉన్నారు.

ప్రాణం మీదికి వచ్చిన కుస్తీ పోటీలు:

అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ పలు గ్రామాభివృద్ధి కమిటీలు నిర్వహిస్తున్న కృషి పోటీలునిండు ప్రాణాన్ని బలి గొన్నాయి. గతంలో కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు మద్యం, మత్తు పదార్థాలకు దూరం ఉండడంతోపాటు దాంపత్య జీవితానికి సైతం ఉండేవారని పెద్దలు చెప్తున్నారు. నేటి కాలంలో కల్తీ ఆహార పదార్థాలు తినడంతో పాటు, మద్యం ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి వస్తాదులు సంపూర్ణ ఆరోగ్యాలను కోల్పోతున్నారు. ఫలితంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

కుస్తీ పోటీలను రద్దు చేయాలి: కల్తీ కాలంలో ప్రజల ఆరోగ్యాల పై చూపుతున్న ప్రభావం అనేకమంది కుస్తీ వస్తాదులు ఇలాంటి ప్రమాదాల గురి అవుతాక తప్పడం లేదు. అధికారులు కుస్తీ పోటీలో నిషేధించి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News