Karimnagar: ఆడపిల్లలని చంపేశాడు! జూబ్లీనగర్‌లో వెలుగుచూసిన కిరాతక ఘటన!
Karimnagar: కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్‌లో ఘోరం జరిగింది. ఇద్దరు కవల ఆడపిల్లలకు గడ్డిమందు తాగించి బావిలో పడేసి చంపిన కన్నతండ్రి శ్రీశైలం.
Karimnagar: ఆడపిల్లలని చంపేశాడు! జూబ్లీనగర్‌లో వెలుగుచూసిన కిరాతక ఘటన!
Karimnagar: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జూబ్లీ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాల యముడి గా మారి తన ఇద్దరు కవల ఆడ పిల్లలు గీతాన్విషీ (4) గీతాన్విత (4) లకు గడ్డి మందు తాగించి బావిలో పడేసిన సంఘటన సంచలనంగా మారింది. జూబ్లీ నగర్ గ్రామానికి చెందిన శ్రీశైలం తన భార్య మౌనికతో గొడవపడి కవల ఆడ పిల్లలను పాశవీకంగా హత్య చేశాడు. ఆరు సంవత్సరాల క్రితం వీరికి వివాహం కాగా ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయని స్థానికులు తెలిపారు. కుమార్తెలు జన్మించాలని శ్రీశైలం భార్య మౌనికతో తరచూ గొడవపడేవాడు ఇదే విషయమై విడాకులు కావాలని మూడు నెలల క్రితం గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగిందని తెలిపారు.
పెద్దమనుషులు సర్ది చెప్పడంతో తిరిగి కలిసిపోయారు ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం పిల్లలను తీసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి పిల్లలను తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు కవలలు గీతాన్విసి, గీతాన్వితలకు గడ్డి మందు తాగించి శివారులో గల వ్యవసాయ బావిలో తోసివేసి తాను బావిలో దూకాడు అని తెలిపారు. ఎంతసేపటికి వెళ్లినవారు రాకపోవడంతో భార్య మౌనిక వచ్చి చూడగా భర్త బావిలో కనిపించాడు. పిల్లలు ఎక్కడున్నారని అడగగా ఆడుకుంటూ బావిలో పడిపోయారని వెతుకుతున్నట్లు చెప్పాడు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల వారు గ్రామస్తులు బావి వద్దకు చేరుకొని పిల్లలను శ్రీశైలమే బావిలో తోసి వేశాడని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి చేరుకున్న
ఏసిపి విజయ్ కుమార్, సీఐ నిరంజన్ రెడ్డిలు హుటాహుటిన బావిలో పడ్డ కవల పిల్లలు కోసం గాలించగా మృతదేహాలు లభించగా వాటిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోసిన పోలీసులు తెలిపారు.