Khammam: ఖమ్మంలో రేపు బీజేపీ బహిరంగ సభ.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్న ఈటల రాజేందర్
Khammam: సభను సక్సెస్ చేసేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని వెల్లడి
Khammam: ఖమ్మంలో రేపు బీజేపీ బహిరంగ సభ.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్న ఈటల రాజేందర్
Khammam: రేపు ఖమ్మంలో జరిగే బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఖమ్మంలో జరిగే అమిత్ షా సభకు అన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వారం రోజులుగా స్థానిక నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని వెల్లడించారు. సభలో వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది ప్రజా ప్రతి నిధులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 2వ ఏఎన్ఎంల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు. ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజాలు నిర్వహించారు.