BJP Dappula Mota: నేడు బీజేపీ డప్పుల మోత కార్యక్రమం
* దళిత బంధు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ * జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ
నేడు బీజేపీ డప్పుల మోత కార్యక్రమం(ఫైల్ ఫోటో)
BJP Dappula Mota: దళిత బంధును అమలు చేయాలని బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. డప్పుల మోత పేరుతో దళిత బంధును అమలు చేయాలని నిరసన తెలుపనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి డప్పుల మోత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు. అయితే బీజేపీ చేపట్టనున్న డప్పుల మోత కార్యక్రామనికి అనుమతి లేదని పోలీసులు చెబతున్నారు.