BJP Padayatra: ఈ నెల 14 నుంచి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

BJP Padayatra: జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రెండో విడత పాదయాత్ర...

Update: 2022-04-08 03:02 GMT

BJP Padayatra: ఈ నెల 14 నుంచి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర

BJP Padayatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 14 నుంచి రెండో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు. అంబేద్కర్‌ జయంతి రోజున జోగులాంబ గద్వాల జిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. 31 రోజుల పాటు సాగే ప్రజాసంగ్రాయ యాత్ర కోసం 30 నిర్వహణ కమిటీలను నియమించారు. ఈ యాత్రను ప్రారంభిచేందుకు అస్సాం లేదా కర్ణాటక సీఎంలను ఆహ్వానించనున్నారు. మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పాదయాత్ర ముగియనుంది.

పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా హాజరుకానున్నారు. ప్రజా సంగ్రామ యాత్రను బీజేపీ అస్ర్తంగా మల్చుకుంది. తొలి విడత పాదయాత్రలో టీఆర్‌ఎస్ సర్కార్‌ వైఫల్యాలను తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌ చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి హుస్నాబాద్‌ వరకు 36 రోజుల పాటు మొదటి విడత పాదయాత్ర సాగింది.

ఇక రెండో విడత పాదయాత్రను బీజేపీ ఛాలెంజింగ్ గా తీసుకుంది. తొలి రోజు 4 కిలోమీటర్ల మేర మాత్రమే పాదయాత్ర సాగనుంది. 31 రోజుల్లో 387కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ప్రతి రోజు 13 కిలో మీటర్లు బండి ప్రజా సంగ్రామ యాత్ర నడవనుంది. నాగరకర్నూల్, మహబూబ్ నగర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనున్నట్లు యాత్ర నిర్వాహుకులు రూట్ మ్యాప్ ను ప్రకటించారు.

వేసవి కాలం దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు బండి సంజయ్‌ పాదయాత్ర సాగనుంది. ఉదయం వేళ పాదయాత్ర ముగియగానే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కుల, చేత వృత్తిదారులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. 

Tags:    

Similar News