BJP Wins Delhi: దిల్లీలో బీజేపీ విజయం ప్రాంతీయ పార్టీల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోందా?

ఢిల్లీలో బీజేపీ గెలుపు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గురించి అందరికీ తెలుసు. కానీ, ఈ గెలుపు బీజేపీ లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగమా? ప్రాంతీయ పార్టీలతో ఈ పార్టీ నేషనల్ గేమ్ ఆడుతోందా? ఢిల్లీలో ఆప్ ఓటమి తరువాత రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటేంటి? ఆప్ ఓటమి మరో నాలుగైదు రాష్ట్రాల్లో అధికార పార్టీల భవితవ్యాన్ని ఆందోళనలో పడేసిందా? ఇదే నేటి ట్రెండింగ్ స్టోరీ.

Update: 2025-02-11 01:30 GMT

దిల్లీలో బీజేపీ విజయంతో ప్రాంతీయ పార్టీలు జడుసుకున్నాయా?

BJP Wins Delhi

ఢిల్లీలో బీజేపీ గెలుపు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గురించి అందరికీ తెలుసు. కానీ, ఈ గెలుపు బీజేపీ లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగమా? ప్రాంతీయ పార్టీలతో ఈ పార్టీ నేషనల్ గేమ్ ఆడుతోందా? ఢిల్లీలో ఆప్ ఓటమి తరువాత రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటేంటి? ఆప్ ఓటమి మరో నాలుగైదు రాష్ట్రాల్లో అధికార పార్టీల భవితవ్యాన్ని ఆందోళనలో పడేసిందా? ఇదే నేటి ట్రెండింగ్ స్టోరీ.

Full View

బీజేపి పొలిటికల్ స్ట్రాటజీ

బీజేపి ప్రాంతీయ పార్టీలను ఒక్కొక్కటిగా తొక్కేయాలని చూస్తోందా? దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించిన తరువాత ఈ ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది. ఇప్పటికీ దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల సంస్కృతిని క్రమక్రమంగా తొలగిస్తూ పోతే కాంగ్రెస్ వంటి జాతీయ ప్రత్యర్థి పక్షంతో పొలిటికల్ గేమ్ అడడం బాగుంటుందన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ ప్రాంతీయ పార్టీల అడ్రస్ గల్లంతు

గతంలో మహారాష్ట్రలో శివసేన పార్టీ, బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడి, ఒడిషాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతా దళ్ పార్టీల పరిస్థితే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని వారు అంటున్నారు. అంతెందుకు...మొన్నటికిమొన్న ఏపీలో వైసీపీని, నిన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని పక్కకు పెట్టడంలోనూ బీజేపి ఇదే స్ట్రాటెజీని ఫాలో అయిందంటున్నారు.

వన్ నేషన్... ఓన్లీ నేషనల్ పార్టీస్!

రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాషాయం జండా ఎగురవేయాలన్నది బీజేపి లక్ష్యం. ఆ పార్టీ నాయకులు కొందరు ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతూ ఉంటారు. 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీజేపి తన ఉనికి లేని రాష్ట్రాల్లో కూడా బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఐతే ప్లాన్ A, లేదంటే ప్లాన్ B

వీలైతే ప్రాంతీయ పార్టీల సాయం లేకుండానే అధికారం చేపట్టడం బీజేపి ముందున్న ప్లాన్ A. అది కుదరదు అనుకున్నప్పుడు అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీని ఓడించేందుకు మరో ప్రాంతీయ పార్టీతో కలిసి జత కట్టడం ప్లాన్ B. ఈ రెండింటిలో ప్లాన్ A సక్సెస్ అయితే బీజేపి నేరుగా అధికారంలోకి వస్తుంది. లేదా ప్లాన్ బి సక్సెస్ అయితే... కూటమితో కలిసి అధికారాన్ని పంచుకుంటుంది. మొత్తానికి ఏ ప్లాన్ సక్సెస్ అయినా... ఆ రాష్ట్రంలోకి బీజేపి కాలుపెట్టడం మాత్రం పక్కా. బీజేపి బయటికి చెప్పకుండా ఇంప్లిమెంట్ చేసే కామన్ హిడెన్ ఎజెండా కూడా ఇదే.

ఏపీలో ఏం జరిగింది?

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌నే తీసుకోండి. ఇక్కడ అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేనతో చేతులు కలిపింది బీజేపీ. ఆ విధంగా అసలు తన ఉనికే లేని రాష్ట్రంలో బీజేపీ అధికార కూటమిలో భాగంగా నిలబడింది.

దిల్లీలో ఇంపాక్ట్ ఏంటి?

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపి సక్సెస్‌ఫుల్‌గా ఇంటికి పంపించింది. ఇప్పుడు బీజేపి ముందున్న తక్షణ లక్ష్యం ఛలో బిహార్. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఎన్డీఏ భాగస్వామి నితీష్ కుమార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వడం వల్ల బీజేపికి నితీష్ కుమార్ దగ్గరి బంధువయ్యాడు. అందుకే నేరుగా నితీష్ కుమార్‌ను బీజేపి టార్గెట్ చేయకపోవచ్చు. కానీ ఎక్కువ సీట్లలో గెలిచి మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది.

డేంజర్ జోన్‌లో ప్రాంతీయ పార్టీలు?

బీహార్ తరువాత వాట్స్ నెక్ట్స్ అంటే... పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కనిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్లో ఎప్పటికప్పుడు బీజేపి పట్టు పెంచుకుంటూ వస్తోంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో 2011 నుండి మమతాదీదీ హవా నడుస్తోంది. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కేవలం 3 స్థానాలకే పరిమితమైన బీజేపి 2021 నాటికి 77 స్థానాలకు ఎదిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకుంటామని చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ఓటమి బీజేపికి భారీ బూస్టింగ్ కానుంది. కోల్‌కతాలో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు తరువాత పెరిగిన వ్యతిరేకత మమతా బెనర్జీ సర్కారుకు మైనస్ కానుంది. మొత్తానికి తమదే నెక్ట్స్ రూలింగ్ పార్టీ అని పశ్చిమ బెంగాల్ బీజేపి చీఫ్ సువేందు అధికారి ధీమా వ్యక్తంచేస్తున్నారు.

ఇక సౌత్ విషయానికి వస్తే.. ఏపీలో ఎన్డీఏయేదే అధికారం. తెలంగాణలో పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వచ్చే ఎన్నికల నాటికి వ్యతిరేకత మొదలైతే దాన్ని తనకు అనువుగా మలచుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే, తెలంగాణ అసెంబ్లీలోనూ, పార్లమెంట్‌ స్థానాల్లోనూ బీజేపీ బలం చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది.

ప్రస్తుతానికి ఆ పార్టీ వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కేరళ, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. అక్కడ తన ఖాతా ఎలాగైనా తెరవాలనే పట్టుదలతో ఈ పార్టీ వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో కనుక బీజేపీ వచ్చే ఏడాది తన ఉనికిని చాటుకోగలిగితే.. అది నార్త్ ఇండియా పార్టీ అనే ముద్ర నుంచి పూర్తిగా బయటపడినట్లవుతుంది. ఈ పవర్ గేమ్‌లో బీజేపీకి దూకుడుకు ప్రాంతీయ పార్టీలే కళ్ళెం వేస్తున్నాయి. ఆ హర్డిల్ దాటే ప్రయత్నంలో దిల్లీ గెలుపు బీజేపీకి ఒక తిరుగులేని సంకేతంగా మారింది.

Tags:    

Similar News