Telangana: రాజన్న రాజ్యం కాదు రామరాజ్యం కావాలి: బీజేపీ ఎంపీ అరవింద్

Telangana: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుతురు షర్మిల పొలిటికల్ పార్టీపై బీజేపీ నేతస్పందించారు.

Update: 2021-02-20 12:55 GMT

అరవింద్ ఫైల్  ఫొటో 

Telangana:‌వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి సన్నాహాలు చేస్తున్నతరుణంలో నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ మతపరమైన అంటూ వ్యాఖ్యానించారు. షర్మిల సమయం వృథా చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రజలకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని, రామరాజ్యం అని అరవింద్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ నేతల అండతో భూ కబ్జాలు, ఇసుక దందాలు మితిమీరిపోయాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ర్ట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూ నిర్వాసితులను కుక్కలతో పోల్చడం సిగ్గు చేటన్నారు. మంత్రిగా ఉండి దిగజారుడు తనానికి పాల్పడుతున్నారని విమర్శించారు. 

మరోపక్క, పార్టీ ఏర్పాటుకు చేసే దిశగా షర్మిల పయనిస్తున్నారు. నేడు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీంతో వైఎస్ అభిమానుల రాకతో లోటస్ ఫండ్ కళకళాడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం షర్మిలా పార్టీపై స్పందిస్తున్నారు. అయితే షర్మిలా మాత్రం పక్కా ప్రణాళికతోనే ముందుకు పోతున్నారు. 

Tags:    

Similar News