Medchal: బీజేపీ నాయకుడు ముక్కెర తిరుపతి రెడ్డి మిస్సింగ్‌

Medchal: అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి రెడ్డి భార్య సుజాత

Update: 2023-07-14 05:19 GMT

Medchal: మేడ్చల్ జిల్లా అల్వాల్‌లో బీజేపీ నేత మిస్సింగ్‌ కలకలం రేపింది. బీజేపీ నాయకుడు ముక్కెర తిరుపతి రెడ్డి నిన్న అల్వాల్ ఎమ్మార్వో కార్యాలయానికి తన వాహనంలో వెళ్లారు. ఆ తర్వాత తన వాహనం వచ్చే సరికి తిరుపతి రెడ్డి కనిపించకుండా పోయారు. దీంతో తిరుపతి రెడ్డి భార్య సుజాత అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని గతంలో తిరుపతి రెడ్డి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రెడ్డికి చెందిన భూమిలో కబ్జాకు ప్రయత్నించి.. కొందరు వ్యక్తులు అక్రమంగా గోడలు నిర్మించారు. ఒకే ఫైల్ నెంబర్ మీద 17 తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ భూమి వివాదంలోనే తిరుపతి రెడ్డిని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు కుటుంబసభ్యులు.

Tags:    

Similar News