Bandi Sanjay: విజయశాంతికి బీజేపీనే చివరి మజిలీ కావాలి
Bandi Sanjay: ఢిల్లీలో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసింది విజయశాంతి
Bandi Sanjay: విజయశాంతికి బీజేపీనే చివరి మజిలీ కావాలి
Bandi Sanjay: విజయశాంతి 25ఏళ్లుగా రాజకీయాల్లో ఉండటం మామూలు విషయం కాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రసంగించిన ఆయన విజయశాంతికి బీజేపీనే చివరి మజిలీ కావాలన్నారు. దేశ రాజధానిలో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసింది విజయశాంతి అని తెలిపారు. పార్లమెంట్‌లో పోడియం వద్ద ఆమె జై తెలంగాణ అని నినదించారన్నారు. అభిప్రాయ బేధాలతో సిద్ధాంతాలు కలిగిన వారు పార్టీని వీడారని.. వారిని తిరిగి బీజేపీలో చేర్చుకునేందుకు ఘర్ వాపసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు బండి సంజయ్.