Nizamabad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైక్ దొంగలు అరెస్ట్
Nizamabad: నలుగురిని అరెస్ట్ చేసిన నిజామాబాద్ జిల్లా పోలీసులు.. రూ.70 లక్షలు విలువ చేసే 42 బైక్‌లు స్వాధీనం
Nizamabad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైక్ దొంగలు అరెస్ట్
Nizamabad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైక్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. 70 లక్షల విలువైన 42 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు జిల్లా పోలీసులు. అందులో 11 రాయల్ ఎన్‌ఫీల్ట్, 18 యాక్టివాలు, 8 పల్సర్ సహా ఇతర బైక్‌లు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో బైక్ చోరీలపై 38 FIRలు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు బైక్ దొంగలను అరెస్ట్ చేసి వాహనాలను రికవరీ చేశారు. కర్ణాటకలోని రాయచూర్, మహారాష్ట్రలోని నాందేడ్‌లలో దొంగతనం చేసిన వాహనాలను అమ్మేవారని పోలీసులు వెల్లడించారు.