MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
MLC Kavitha: రేపు ఈడీ ఆఫీస్‌లోనే కవిత విచారణ
MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట
MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. రేపటి ఈడీ విచారణకు హాజరుపై మినహాయింపు కోరగా.. అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీంతో రేపు కవిత ఈడీ ఆఫీస్‌కు విచారణకు హాజరుకానున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కవిత. మహిళను విచారణ కోసం ఆఫీస్‌కు పిలవడం చట్టవిరుద్ధమని అందులో పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. దీంతో కవిత రేపు ఈడీ ఆఫీస్‌లోనే విచారణ ఎదుర్కోనున్నారు.