మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర
Bhatti Vikramarka: దారిపొడవున పూలవర్షం కురిపిస్తూ.. బాణా సంచా కాల్చిన కార్యకర్తలు
మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర
Bhatti Vikramarka: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమర్క. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేరుతో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. చింతకాని మండలం పాతర్లపాడులో ఎంపీటీసీ బొర్రా ప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్తులు భట్టి విక్రమార్కకు ఘనస్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. డప్పు, డోలు వాయిధ్యాలు, కోలాట నృత్యాల సందడి చేస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి సందడి చేశారు. దారిపొడవున ప్రజలు తమ సమస్యలను భట్టి విక్రమార్కకు వివరించారు. భట్టి పాదయాత్రకు టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు.