కంటి వెలుగు 2.0 ప్రారంభోత్సవానికి హాజరైన భట్టి.. భట్టిని జాతీయ నేతలకు పరిచయం చేసిన కేసీఆర్

Bhatti Vikramarka: భట్టిని అప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి

Update: 2023-01-18 09:32 GMT

కంటి వెలుగు 2.0 ప్రారంభోత్సవానికి హాజరైన భట్టి.. భట్టిని జాతీయ నేతలకు పరిచయం చేసిన కేసీఆర్

Bhatti Vikramarka: CLP నేత భట్టి విక్రమార్క కంటి వెలుగు రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. భట్టిని సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. జాతీయ నేతలకు పరిచయం చేశారు. భట్టిని దగ్గరగా తీసుకొని నవ్వుతూ కేసీఆర్ పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష నేతలు దూరంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో పిలిచినా రారు మరికొన్ని సార్లు పిలవకపోతే ప్రొటోకాల్ పాటించలేదని ఆరోపించడం పరిపాటి. కానీ, బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ముందు కంటి వెలుగు రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి భట్టి హాజరవడం ముఖ్యమంత్రి ఆప్యా్యంగా పలకరించి నేతలకు పరిచటం చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.

గతంలో ప్రగతిభవన్‎లో దళిత బంధు కార్యక్రమం అమలుపై నిర్వహించిన అఖిలపక్ష భేటీకి భట్టి విక్రమార్క హాజరవడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. తాజాగా కంటి వెలుగు కార్యక్రమానికి హాజరవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పారా లేదా అనే చర్చ జరుగుతోంది. ఇటీవల భట్టి విక్రమార్కతో పాటు సీనియర్లు రేవంత్ తీరు పట్ల గుర్రుగా ఉన్నారు. వీరి అలకతో ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జిని మార్చారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి వేదిక పంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News