భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తోగు నీరు అమృతం.. సుదీర్ఘ వ్యాధులకు ఔషదం...

Bhadradri Kothagudem: తమ తోగును గుర్తించి మరమ్మత్తులు చేయించి అభివృద్ధి చేయాలని కోరుతున్న స్థానికులు...

Update: 2022-05-29 02:30 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తోగు నీరు అమృతం.. సుదీర్ఘ వ్యాధులకు ఔషదం...

Bhadradri Kothagudem: నల్ల రాతిని తన గర్భంలో దాచుకున్న నేల తల్లి వడిలో మూడు వందల అడుగుల ఎత్తైన రాతి గుట్ట దిగువన మద్దిచెట్టు, జిన్నచెట్టు వేర్ల మధ్య నుండి ఉబికి వస్తున్న నీళ్ల ఊట ప్రవాహం వందల ఏళ్లుగా అక్కడి ఆదివాసి గిరిజనులకు వరమై దాహార్తిని తీరుస్తుంది. ఆ గుంతకు సమ్మక్క తోగూ అని నామకరణం చేయగా.... అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ తోగూ నీళ్లే తాగుతున్నారు అక్కడి జనం. స్థానికుల సుదీర్ఘ వ్యాధులకు ఔషదంగా పని చేస్తున్న తోగూడెం నీటిపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో రధం గుట్టకు దిగువన గల ఓ గిరిజన గూడెంలో ఏ కాలమైనా ఎండిపోని ఊట నీరు ఇక్కడి ఆదివాసి గిరిజనులకు వరంలా మారింది. ఈ గ్రామ ప్రజల దాహార్తిని తీరుస్తుంది. తరతరాలుగా ఈ తోగు నీటినే తాగుతున్న తమకు ఎలాంటి జబ్బులు రావంటున్నారు స్థానికులు. కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్నవారు ఈ నీటిని తాగితే నయం కావడం కాయమని చెబుతున్నారు.

చుట్టు పక్కల ప్రాంతాల వాసులే కాకుండా మణుగూరు, అస్వాపురం మండలాల పట్టణ వాసులు కూడా ఈ నీటిని తీసుకెళ్లి మంచి నీళ్లుగా ఉపయోగిస్తున్నారు. పూర్వం గ్రామం ఏర్పడిన నాడు తోగు అని పేరు పెట్టామని... ఆపేరే తమ పూర్వీకులు గ్రామానికి పెట్టారని చెబుతున్నారు. అందుకే తమ గూడానికి తోగ్గూడెం అని పేరు వచ్చింది తెలిపారు. గ్రామ పంచాయితీలో మిషన్ భగీరథ నీరు వస్తున్నప్పటికీ గ్రామస్తులు మాత్రం ఈ తోగు నీరే వరంగా తీసుకుంటున్నారని అంటున్నారు.

ప్రభుత్వం తమ తోగును గుర్తించి మరమ్మత్తులు చేయించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

Tags:    

Similar News