రామనవమి బ్రహ్మోత్సవాలకు భద్రాద్రి క్షేత్రం సిద్ధం.. ఇవాళ ఎదుర్కోలు...

Bhadrachalam - Sri Rama Navami 2022: రేపు సీతారాముల కల్యాణం, ఎల్లుండి పట్టాభిషేకం...

Update: 2022-04-09 04:54 GMT

రామనవమి బ్రహ్మోత్సవాలకు భద్రాద్రి క్షేత్రం సిద్ధం.. ఇవాళ ఎదుర్కోలు...

Bhadrachalam - Sri Rama Navami 2022: భద్రాద్రి క్షేత్రం రామనవమి బ్రహ్మోత్సవాలు సర్వం సిద్ధమైంది. రేపు సీతారాముల కల్యాణం, ఎల్లుండి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. విద్యుత్ దీపాల అలంకరణలతో దేదీప్యమానంగా రామాలయం భక్తులకు కనువిందు చేస్తోంది. అలాగే ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ సరిపడా లడ్డు ప్రసాదాలు,తలంబ్రాలను భారీగా సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్16న చక్రతీర్ధం, పూర్ణాహుతి, ధ్వజారోహణం, పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.

బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, అంకురార్పణ, 7న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడావాసం,8న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 9న ఎదుర్కోలు ఉత్సవం,10 న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 11 న రామయ్య మహపట్టాభిషేకం జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఏప్రిల్ 2 నుండి 16 వరకు నిత్యకళ్యాణాలు, 6 నుండి 16 వరకు దర్బార్ సేవలు,6 నుండి 23 వరకు పవళింపు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కోవిడ్ 19 కారణంగా గత రెండేళ్లుగా కల్యాణానికి భక్తులకు అనుమతి లేదు. ఈ ఏడాది భారీగా భక్తులు హాజరవుతారని అంచనతో మిథిలా స్టేడియాన్ని సర్వాoగ సుందరంగా రూపుదిద్దుతున్నారు. 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 3 లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. శ్రీరామనవమి రోజున తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డులకు 30 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. బ్రహ్మోత్సవాలకు సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టారు.

Tags:    

Similar News