టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ బెదిరింపులు.. ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Fake Officers: యువకుడి నుంచి రూ.3 వేలు లాక్కెళ్లిన దుండగులు

Update: 2023-07-08 06:55 GMT

టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ బెదిరింపులు.. ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Fake Officers: టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ బెదిరించి రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడి దగ్గర నుంచి డబ్బులు కాజేసిన ఘటనలో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. టోలీచౌకి ఎస్ఏ కాలనీలో నివాసముంటున్న అహ్మద్ చౌదరి బీటెక్ చదువుతున్నాడు. ఈనెల 4న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హకీంపేట సమీపంలోని బృందావన్ కాలనీలో బైక్ పై వెళుతుండగా, . ముగ్గురు వ్యక్తులు టూవీలర్ పై వచ్చి.. అహ్మద్ ను ఆటకాయించారు. తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని బెదిరించారు. అహ్మద్ నుంచి ఆన్ లైన్ ద్వారా 3వేల రూపాయలు ట్రాన్సపర్ చేయించుకున్నారు. సెల్ ఫోన్ కు చెందిన ఇయర్ బడ్ ను కూడా లాక్కుని పారిపోయారు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఫిలింనగర్ క్రైం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ పుటేజీని పరిశీలించారు. అయితే, యువకుడి నుంచి ఐఫోన్ కు చెందిన ఇయర్ బడ్స్ జతలో ఒకదాన్ని మాత్రమే నిందితులు లాక్కెళ్లారని బాధితుడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఐఫోన్ లోని ట్రాకర్ సాయంతో నిందితుల లొకేషన్ గుర్తించి పట్టుకున్నారు. నిందితులు మెహిదీపట్నం రాయల్ కాలనీకి చెందిన షేక్ మహ్మద్ సైఫ్ హుమాయున్ నగర్ కు చెందిన అష్వక్ అహ్మద్, మహ్మద్ ఇద్రిసన్ గా గుర్తించారు.నిందితులు రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారిని ఆటకాయించి టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ బెదిరి స్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

Tags:    

Similar News