Beerla Ilaiah: గడప గడపకు వెళ్లి ప్రభుత్వ మోసాలను వివరించిన బీర్ల అయిలయ్య
Beerla Ilaiah: ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో యాత్ర
Beerla Ilaiah: గడప గడపకు వెళ్లి ప్రభుత్వ మోసాలను వివరించిన బీర్ల అయిలయ్య
Beerla Ilaiah: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామం నుండి టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. చోక్లా తండా, బాబ్ల నాయక్ తండా, రాంపూర్, పెద్ద తండా గ్రామాల గుండా యాత్ర కొనసాగనుంది. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు బీర్ల అయిలయ్య. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కలిగే లాభాలను వివరిస్తూ యాత్ర కొనసాగిస్తున్నారు.