సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో బొడ్డెమ్మ ఆరాధన.. వరంగల్ టీచర్స్ కాలనీలో బొడ్డెమ్మ వైభవం

Warangal: బొడ్డెమ్మను కొలువుదీర్చి ఆరాధించిన మహిళలు

Update: 2022-09-24 02:29 GMT

సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో బొడ్డెమ్మ ఆరాధన.. వరంగల్ టీచర్స్ కాలనీలో బొడ్డెమ్మ వైభవం

Warangal: సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో బొడ్డెమ్మను ఆరాధించారు. ప్రతియేటా విజయదశమి సందర్భంగా ప్రకృతిని ఆరాధించే క్రమంలో బతుకమ్మ సంబరాల తరహాలోనే బొడ్డెమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కాలక్రమంలో బొడ్డెమ్మ వైభవం కనుమరుగుకాకూడదని వరంగల్ టీచర్స్ కాలనీకి చెందిన కవిత మిత్రబృందంతో కలిసి బొడ్డెమ్మను కొలువుదీర్చి పూజించారు.సంస్కృతికి ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ ఆరాధన పుట్టమట్టితో రూపొందించి, పసుపు, కుంకుమ, పూలతో పూజించి తరించే ఆడపడుచులు సందడి చేశారు.

బొడ్డెమ్మను ఆరాధిస్తే సుఖసౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని, అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తుల విశ్వాసం. కాలక్రమంలో బొడ్డెమ్మ రూపురేఖలను మార్చేశారు. పట్టణ ప్రాంతాల్లో పుట్టమట్టి లభించే అవకాశం లేకపోవడంతో బొడ్డెమ్మను కలపతో రూపొందించి, రాగిశంబుతో కలశస్థాపన, పసుపుతో బొడ్డెమ్మ ప్రతిరూపాన్ని ప్రతిష్టించి మహిళలు ఆనందోత్సాహాలనడుమ అమ్మవారిని వైభవాన్ని సాక్షాత్కరింప జేశారు.

ఆధునిక యుగంలో మానవసంబంధాలు దూరమవుతున్న నేపథ్యంలో పండుగలు, సంస్కృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధించే పండుగ రోజుల్లో మహిళలందరూ ఒకచోటచేరి తరతమ్యాల్లేకుండా ఆనందకర వాతావరణంలో ఆడిపాడారు. ఉత్సాహంగా అడుగులేసి ఆత్మీయత, అనునబంధాలను చాటుకున్నారు.



Tags:    

Similar News