Bandi Sanjay: నేడు సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో బండి సంజయ్ టూర్
* బండి సంజయ్ పర్యటనపై టెన్షన్..టెన్షన్ * బండి సంజయ్ టూర్ నేపథ్యంలో భారీ బందోబస్తు
నేడు సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో బండి సంజయ్ టూర్(ఫోటో - ది హన్స్ ఇండియా)
Bandi Sanjay: ఇవాళ రెండో రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోళ్లను పరిశీలించనున్నారు. సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ పర్యటన కొనసాగనుంది. నిన్న బండి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ, హుజుర్‌నగర్ నియోజకవర్గాలలో బండి సంజయ్ టూర్‌లో టీఆర్ఎస్ బీజేపీ క్యాడర్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
పరస్పరం రాళ్లు, కోడిగుడ్లు, టమాటలు విసురుకున్నారు. ఇవాళ్టి బండి సంజయ్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సూర్యాపేటలో కార్యకర్తలతో సమావేశం అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బండి సంజయ్ పరిశీలించనున్నారు. రెండో రోజు సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ పర్యటనపై టెన్షన్ వాతావరణం నెలకొంది.