Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
Bandi Sanjay: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి
Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
Bandi Sanjay: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. 4 ఏళ్ల ప్రొబేషనరీ కాలం పూర్తయిన ఉగ్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆరు రోజులుగా రాష్ట్రంలోని 9 వేల 350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేస్తున్నారని సంజయ్ తెలిపారు. మూడేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని మరో ఏడాది పొడిగించినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించారని.. గడువు దాటినా రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమని లేఖలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ ఉద్యోగులతో కలిసి బీజేపీ ఉద్యమిస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.