Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ లేఖ
Bandi Sanjay: ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణానికి... 5 లక్షల 4 వేలు చెల్లించాలని వినతి
Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ లేఖ
Bandi Sanjay: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల 4 వేల రూపాయలు చెల్లించాలని విన్నవించారు. నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ను, స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహా మాజీ సీఎం కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.