Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
Bandi Sanjay: బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్
సీఎం కెసిఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)
Bandi Sanjay: తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధును అమలు చేయాలని కోరారు. ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షల ఆర్ధిక సాయం అందించాలని కోరారు. అదే విధంగా కేబినెట్ లో 8 మంది బీసీలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలపై సవతి తల్లి ప్రేమను విడనాడాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ కు చట్ట భద్రత కల్పించాలన్నారు బండి సంజయ్.