Bandi Sanjay: MIMపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
Bandi Sanjay: ముస్లింలను MIM ఓటు బ్యాంకుగానే చూస్తుంది.
Bandi Sanjay: MIMపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
Bandi Sanjay: ఎంఐఎంపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయడం ఎంఐఎంకు అలవాటన్నారు. ముస్లింల జీవితాలను నాశనం చేస్తున్న పార్టీ ఎంఐఎం అన్న బండి సంజయ్.. ముస్లింలను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తుందన్నారు. ఒవైసీ ఆస్తులు పెంచుకోవడం తప్ప.. ఓల్డ్ సిటీలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి బీజేపీని ఓడించేందుకు సిద్ధమయ్యాయన్న బండి.. బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. దమ్ముంటే ఎంఐఎం అన్నిచోట్లా పోటీ చేయాలని సవాల్ విసిరారు.