Bandi Sanjay: అధ్యక్ష పదవికి రాజీనామా తర్వాత బండి సంజయ్ ఉద్వేగభరిత ట్వీట్
Bandi Sanjay: కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా ముగించాల్సి వస్తుంది
Bandi Sanjay: అధ్యక్ష పదవికి రాజీనామా తర్వాత బండి సంజయ్ ఉద్వేగభరిత ట్వీట్
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించడంతో బండి సంజయ్ ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ‘మన జీవితాల్లో కొన్ని అధ్యాయాలకు ముగింపు లేకున్నా ముగించాల్సి వస్తుంది’ అంటూ పేర్కొన్నారు.తన పదవీకాలంలో ఒకవేళ ఎవరినైనా అనుకోకుండా బాధపెట్టి ఉన్నప్పటికీ అన్యదా భావించకుండా అందరి ఆశీస్సులను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
తనది బాధాకర కథ కానందున సంతోషంగా ఉన్నానని.. తనపై దాడులు, అరెస్టుల సమయంలో నేతలంతా అండగా నిలిచి తనకు మధురానుభూతులు మిగిల్చారన్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తాను చేసిన పోరాటంలో అరెస్టులు, దాడులను ఎదుర్కొన్నప్పటికీ ఎదురొడ్డి నిలబడ్డ బీజేపీ కార్యకర్తలందరికీ హ్యాట్సాఫ్ తెలుపుతున్నానన్నారు. సుఖదుఃఖాల్లో కార్యకర్తలంతా తన వెంట నిలిచారని... తాను సైతం ఎల్లప్పుడూ వారిలో ఒకడిగా ఉన్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.
కిషన్‌రెడ్డి సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానన్నారు. తనలాంటి సాధారణ కార్యకర్తకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, శివప్రకాశ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్‌లకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.