Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు
Bandi Sanjay: మోడీని మూడోసారి ప్రధానిని చేయాలని సంకల్పంతో.. విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టాం
Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు
Bandi Sanjay: నిర్మల్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. యాత్రలో ఎంపీ బండి సంజయ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. మోడీని మూడోసారి ప్రధానిని చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతుందన్నారు.
ముందుగా నిర్మల్‌లోని వేయిఉరుల మర్రి అమరవీరులకు ఎంపీ బండి సంజయ్‌నివాళులర్పించారు. తెలంగాణ వీరుల చరిత్రను ప్రజలకు తెలియకుడదనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని ఎంపీ బండి సంజయ్ అన్నారు.