Bandi Sanjay: నాగార్జున సాగర్ బీజేపీ నేతలకు బండి సంజయ్ క్లాస్
Bandi Sanjay: పీకారు. సాగర్ ఉప ఎన్నికలకు ఎవరికి వారే ప్రచారం చేసుకోవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Representational Image
Bandi Sanjay: నాగార్జున సాగర్ బీజేపీ నేతలకు బండి సంజయ్ క్లాస్ పీకారు. సాగర్ ఉప ఎన్నికలకు ఎవరికి వారే ప్రచారం చేసుకోవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ జిల్లా నేతలతో.. సాగర్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. సాగర్ నేతల తీరుతో పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్.. పర్యటన ముగించుకుని, ఢిల్లీ బయలుదేరారు.
పలువురు నేతలు తీరు మార్చుకోవాలని బండి సంజయ్ హెచ్చరించారు. పార్టీ లైన్ దాటితే, ఉపేక్షించేది లేదన్నారు. నాగార్జున సాగర్ టికెట్ ఎవరికి ఇచ్చిన కలిసి పనిచేసుకోవాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశంలో.. క్షేత్రస్థాయి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.