Bandi Sanjay: బండి సంజయ్ కు కీలక పదవి.. ఉత్తర్వులు జారీ చేసిన జేపీ నడ్డా..!
Bandi Sanjay Kumar: జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ నియామకం
Bandi Sanjay: బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు..
Bandi Sanjay Kumar: బండి సంజయ్‌కు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. సంజయ్‌కు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బీజేపీ నేత సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించింది. అలాగే, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.