నెలకు 6 వేలు పెన్షన్ ఇవ్వాల్సిందే.. సీఎం కేసీఆర్ కు బట్టతల బాధితుల సంఘం సంచలన డిమాండ్..

6000 Pension: తమకు కూడా పెన్షన్ ఇవ్వాలని బట్టతల బాధితులు సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు.

Update: 2023-01-07 08:05 GMT

నెలకు 6 వేలు పెన్షన్ ఇవ్వాల్సిందే.. సీఎం కేసీఆర్ కు బట్టతల బాధితుల సంఘం సంచలన డిమాండ్..

6000 Pension: తమకు కూడా పెన్షన్ ఇవ్వాలని బట్టతల బాధితులు సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు. తమకు నెలకు 6 వేలు పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లి గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బట్టతల బాధితుల సంఘం వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్బంగా తమ సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బట్టతల బాధితుల సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా వెళ్ది బాలయ్యను ఎన్నుకున్నారు. ఇక ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోశాధికారిగా రాము ఎన్నికయ్యారు.

ఈ ఎన్నిక అనంతరం బట్టతల బాధితుల సంఘ అధ్యక్షుడు బాలయ్య మాట్లాడుతూ..తమను కూడా మానసిక వికలాంగుల కింద పరిగణించాలని సీఎం కేసీఆర్ ను కోరారు. సమాజంలో బట్టతల ఉన్న వారు అనేక ఇబ్బందులను గురవుతున్నారు. అందుకే ప్రభుత్వం స్పందించి సంక్రాంతి పండుగ లోపు రూ.6000 పెన్షన్ అందజేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం అన్నారు. మరి వీరి సమస్యపై ప్రభుత్వం అసలు స్పందిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News