Assam CM Controversy: అసోం సీఎం హిమంతపై ఒవైసీ ఫిర్యాదు.. హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ!

Assam CM Controversy: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరియు మజ్లిస్ పార్టీ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది.

Update: 2026-02-09 10:09 GMT

Assam CM Controversy: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరియు మజ్లిస్ పార్టీ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వివాదాస్పద వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒవైసీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వివాదానికి కారణమైన వీడియో ఏంటి?

ఇటీవల అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఒక వర్గం వ్యక్తులను తుపాకీతో కాలుస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు ఉండటంతో నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవ్వడంతో బీజేపీ ఆ వీడియోను తొలగించినప్పటికీ, అప్పటికే అది వైరల్‌గా మారింది.

జాతీయ సమైక్యతకు విఘాతం: ఒవైసీ ఫైర్

ఈ వీడియోపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ముస్లింలను రెచ్చగొట్టేలా మరియు రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ఈ వీడియోను ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేశారని ఒవైసీ ఆరోపించారు. హిమంత బిశ్వ శర్మకు ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడటం అలవాటుగా మారిందని, ఆయన ప్రసంగాలు జాతీయ సమైక్యతకు గొడ్డలి పెట్టు అని మండిపడ్డారు.

విద్వేష ప్రసంగాలు (Hate Speech) చేస్తున్న హిమంతపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. దురదృష్టవశాత్తు జాతి విద్వేష ప్రసంగం కొందరికి రాజకీయాస్త్రంగా మారిందని, ఇలాంటి ధోరణి దేశానికి క్షేమకరం కాదని ఒవైసీ తన ఎక్స్ (Twitter) వేదికగా పేర్కొన్నారు.

Tags:    

Similar News