Ambedkar Jayanti 2021: అంబేద్కర్‌కు నివాళి అర్పించడానికి కేసీఆర్‌కు టైమ్ లేదా?- బండి సంజయ్
Ambedkar Jayanti 2021: పంచతీర్థాల పేరిట అంబేద్కర్‌ను బీజేపీ గౌరవిస్తుంటే తెలంగాణలో అంబేద్కర్‌ను కనీసం స్మరించడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ambedkar Jayanti 2021: అంబేద్కర్‌కు నివాళి అర్పించడానికి కేసీఆర్‌కు టైమ్ లేదా?- బండి సంజయ్
Ambedkar Jayanti 2021: పంచతీర్థాల పేరిట అంబేద్కర్‌ను బీజేపీ గౌరవిస్తుంటే తెలంగాణలో అంబేద్కర్‌ను కనీసం స్మరించడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు సాగర్‌లో సభ పెట్టడానికి టైమ్ ఉంది కానీ అంబేద్కర్‌కు నివాళి అర్పించడానికి టైమ్ లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే పీవీ జయంతి చేశారు అందుకే అంబేద్కర్ జయంతి విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఇంకా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. గడీల పాలనలో ఉన్న తెలంగాణ తల్లికి విముక్తి కలిగిద్దామని పిలుపు ఇచ్చారు బండి సంజయ్. ఒకే కుటుంబం రాజ్యం ఏలుతోంది సమాజం మేల్కొనాలి ఏ ఆశయం కోసం తెలంగాణ సాదించుకున్నామో దాని కోసం పని చేద్దామని పేర్కొన్నారు.