హైదరాబాద్‌కు చేరుకున్న అంబేద్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేద్కర్
Prakash Ambedkar: ప్రకాష్ అంబేద్కర్‌కు ఘన స్వాగతం పలికిన మంత్రి గంగుల కమాలకర్
హైదరాబాద్‌కు చేరుకున్న అంబేద్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేద్కర్
Prakash Ambedkar: భారతరత్న... బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్దమైంది. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకకు ముఖ్యఅతిథిగా హైదరాబాద్ విచ్చేసిన బాబా సాహెబ్ మునిమనుమడు ప్రకాష్ అంబేద్కర్‌ను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా స్వాగతించారు.
ఆయనకు దళిత బంధు జ్ణాపికను అందజేశారు. నేడు హుజురాబాద్‌లో దళిత బంధు లబ్ధిదారులను కలిసి వారి అనుభవాలను, దళిత బంధు ద్వారా వారి జీవితాల్లో వచ్చిన సమూల మార్పుల గురించి ప్రకాష్ అంబేద్కర్ తెలుసుకోనున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రకాష్ అంబేద్కర్‌ని హుజురాబాద్ దళిత బంధు లబ్ధిదారుల వద్దకు తీసుకొని వెళతారు.